మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జి అరసవల్లి సందర్శన

మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి, గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామి ఆలయాలను ఆదివారం

జ్ఞాపికను స్వీకరిస్తున్న జడ్జి వెంకటరమణ

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, పొందూరు

మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి, గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామి ఆలయాలను ఆదివారం దర్శించుకున్నారు. అరసవల్లిలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతించారు. స్వామివారి సేవల్లో పాల్గొన్న అనంతరం న్యాయమూర్తికి అనివెట్టి మండపంలో ఆలయ ఇఒ వి.హరి సూర్యప్రకాష్‌ శేషవస్త్రాన్ని కప్పి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రోటోకాల్‌ జడ్జి కె.రాణి, వన్‌టౌన్‌ ఎస్‌ఐ బలివాడ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.న్యాయమూర్తి స్వగ్రామమైన పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లిలో గ్రామ దేవతను దర్శించుకున్నారు. సోదరులు, కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకున్నారు. హైకోర్టు జడ్జిని పొందూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జ్యోత్స్న, ఎస్‌ఐ లక్ష్మణరావు, ఎంపిడిఒ ఎస్‌.హరిహరరావు, సర్పంచ్‌ రమణ తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

 

 

➡️