ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ప్రజాశక్తి- రామభద్రపురం : భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది రాజ్యాంగమేనని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతీ ఒక్కరు పాలకులు, అధికారులు పౌరులు దేశభక్తి కలిగిన వారేనని కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు జెసి రాజు అన్నారు. ఆదివారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయుడు వలస పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. శృంగవరపుకోట: పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠకులు, లైబ్రేరియన్‌ దామోదర్‌ శ్రీధర్‌, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేవి కూడలి వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి వైసిపి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం, సాంఘిక శాస్త్ర దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు ఇంచార్జ్‌ ప్రధానోపాధ్యా యుడు ఎస్‌. శివరామకృష్ణ తెలిపారు. ఓటర్‌ అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకులు దొడ్డి సూర్యారావు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఘనంగా వేడుకలను నిర్వహిం చారు.బొబ్బిలి: ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగం భారత రాజ్యాంగమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.లోక్‌సత్తా కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.డెంకాడ: స్థానిక శాఖా గ్రంథాలయంలో భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి మహేష్‌ అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.వేపాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సోంపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనూ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్‌ కిలపర్తి అప్పారావు, సోంపురం జిల్లా పరిషత్తు ఉపాధ్యాయులు పి రమేష్‌ నాయుడు పాల్గొన్నారు. గరివిడి : చీపురుపల్లి పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహానికి వైసిపి నాయకులు పతివాడ రాజారావు, మంగళగిరి శ్రీను, సుధారాణి, ఏ.ఓ. ప్రవీణ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కో- అప్షన్‌ మెంబెర్‌ మహమ్మద్‌ ముజకీర్‌, నాయకులు పాండ్రంకి వాస్‌, మీసాల లక్ష్మణ్‌, ప్రభాత్‌ కుమార్‌, గురాన జన, మండల ఆఫీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️