ప్రజాశక్తి – మార్టూరు రూరల్
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు చెట్లు నాటడమే ప్రధమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పాలని రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి సాంబశివరావు, మద్దుమాల కోటేశ్వరరావు తెలిపారు. స్థానిక మద్ది సత్యనారాయణ జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో పిజిఎన్ఎఫ్, ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, భవిషత్తులో జీవప్రాణులకు అవసరమైన ఆక్సిజన్ అందించడం కోసం ఇప్పటి నుండే ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకొని వాటిని సంరక్షించు కోవాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఇంటూరి ఆంజనేయులు, కోశాధికారి చెరుకూరి నాగేశ్వరరావు, జాష్టి సాంబశివరావు, చెన్నుపాటి బసవ రాములు, కొర్రపాటి కాజారావు, మురకొండ ఈశ్వరప్రసాద్, శాఖమూరి వెంకటరామయ్య పాల్గొన్నారు.