ప్రజాశక్తి – మార్టురు రూరల్
పాఠశాల విద్యార్థులలో సాధారణ వ్యాధులు ప్రబలకుండా ఇమ్యూనిటీ పెంపొందించడానికి ఆయుర్వేదం అందిస్తున్న చవన్ ప్రాష్ ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానిక ఆయుర్వేద వైద్యశాల ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి అంజమ్మ తెలిపారు. స్థానిక అంబెడ్కర్ నగర్లోని ఎంపియుపి (ఏఏ) పాఠశాలలోని 120మంది విద్యార్థులకు చవన్ ప్రాష్ లేహ్యం ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది శనివారం పంపిణి చేశారు. కార్యక్రమంలో కొణిదెన ఆయుర్వేద వైద్యశాల కంపౌండర్ బొల్లాప్రగడ తనూజా, ఖాజాబీ, ఇంచార్జ్ హెచ్ఎం నెలకుర్తి ఆంజనేయులు, చింతల సుబ్బారావు, మువ్వా సుబ్రహ్మణ్యం, లేవి జోసెఫ్, కుమారి పాల్గొన్నారు.