రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు సిద్దంగా జట్టు

Nov 26,2023 01:54

ప్రజాశక్తి – పంగులూరు
ఈనెల 26నుండి 28వరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే 33వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు సిద్ధమైందని ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామరెడ్డి తెలిపారు. స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలోని ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీలో 14సంవత్సరాల బాలుర జట్టుకు గత నెల 26నుండి ఈనెల 28వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ జట్టుకు ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామస్తులు భవనం ప్రసన్నాంజనేయరెడ్డి, భవనం శ్రీమన్నారాయణరెడ్డి వారి తండ్రి భవనం అంజిరెడ్డి జ్ఞాపకార్థం రూ.15వేల విలువచేసే క్రీడా దుస్తులను క్రీడాకారులకు అందజేశారు. పంగులూరు మండలం చిన్నమలవరం గ్రామానికి చెందిన మాజీ ఖోఖో క్రీడాకారుడు సచివాలయ ఉద్యోగి, కొప్పోలు వీరాంజనేయులు రూ.6వేల విలువచేసే క్రీడా దుస్తులను క్రీడాకారులకు బహుకరించారు. వీరికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఖోఖో క్రీడాకారులను ఎంపిక చేసి కోచింగ్‌కు పంపిన ఖోఖో జిల్లా కార్యదర్శి భవనం కాశీ విశ్వనాథరెడ్డి, జిల్లా ట్రెజరర్ కె హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. 25రోజులపాటు శిక్షణ నిర్వహించిన ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామరెడ్డికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రస్థాయి ఖోఖో ప్రకాశం బాలురు జట్టు
ప్రకాశం జిల్లా ఖోఖో బాలుర జట్టు వివరాలను ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి తెలిపారు. పంగులూరుకు చెందిన ఎ శ్రీనివాసు, ఎం కేశవ, ఎస్ నాగచైతన్య, యు ఆకాష్, పి వెంకటేశ్వర్లు, ఎ మధుబాబు, బి విష్ణువర్ధన్‌రెడ్డి, కనిగిరి మండలం కెవి పల్లికు చెందిన జి సందీప్, కె సాయి, ఎ నవనీత్ కుమార్‌రెడ్డి, వి నందకిషోర్, టి మనోజ్, కె విష్ణువర్ధన్, సి మనోహర్‌రెడ్డి, రుద్రవరంకు చెందిన ఆర్ వెంకటేష్, ఎం గంగవరంకు చెందిన వి నందకిషోర్, ఈ టీంకు కోచ్‌గా పంగులూరుకు చెందిన ఎ కోరేశ్ బాబు, మేనేజర్‌గా పంగులూరుకు చెందిన ఎన్ షాలెం రాజు వ్యవహరిస్తారని సీతారాంరెడ్డి తెలిపారు.

➡️