ధర్నాను విజయవంతం చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 27,28న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తు న్నామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు

మాట్లాడుతున్న అమ్మన్నాయుడు

ప్రజాశక్తి- మందస

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబరు 27,28న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తు న్నామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, ఎన్‌.గణపతి పిలుపు నిచ్చారు. మందసలో సిఐటియు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి వ్యతిరేకమైన వినాశకర కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తోందని అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగాలు కోల్పోవడం, అధిక ధరల సమస్యలను కార్మికులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను లేబరు కోడ్ల రూపంలో కాలరాస్తోందని అన్నారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచుతామని ప్రకటిస్తున్నాయని అన్నారు. కార్మికుల ప్రాణాలను, భద్రతను, ఆరోగ్యాన్ని పెట్టుబడిదార్ల ప్రయోజనాల కోసం పణంగా పెట్టాయి. గౌరవ వేతనం, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, నిర్ణీత కాలపరిమితి ఉద్యోగాల పేర్లతో పర్మినెంట్‌ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులైన విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, ఓడరేవులు, రైల్వేలు, విద్యుత్‌, విమానాశ్రయాలు, ఎల్‌ఐసి, జాతీయ రహదారులను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు ధారదత్తం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో ఎస్‌.వల్లభరావు, ఎ.కృష్ణారావు, బి.వెంకటేశం, జయరాం, తాతాయ్త, యాదవయ్య తదితరులు పాల్గొన్నారు.

 

➡️