ప్రాంతీయ వైద్యశాలలో క్యాంటీన్ ప్రారంభించండిప్రజాశక్తి- శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో క్యాంటీన్ వెంటనే ప్రారంభించాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను రాష్ట్ర ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి హరీష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ప్రతినిధుల బందం శనివారం ప్రాంతీయ వైద్యశాఖ పర్యవేక్షకులు డాక్టర్ విజయలక్ష్మిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో క్యాంటీన్ నిర్మాణం పూర్తయి ఐదు నెలలు దాటుతోందన్నారు. అయినా దానిని ప్రారంభించడానికి వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు. క్యాంటీన్ అందుబాటులో లేకపోవడంతో వైద్యశాలకు వచ్చే రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని హరీష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాల ఆవరణలో క్యాంటీన్ అందుబాటులో లేకపోవడం వలన రోగులు బయట హోటళ్లను ఆశ్రయించవలసి వస్తోందన్నారు. బయట హోటళ్లలో ధరలు విపరీతంగా ఉండటంతో పేదరోగులు భారం మోయలేక పోతున్నారన్నారు. పేదరోగుల సమస్యలను దష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా క్యాంటీన్ ప్రారంభించాలని హరీష్‌రెడ్డి కోరారు. ఈ సమస్య శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి దష్టికి కూడా తీసుకెళతామన్నారు. ఈసందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వీలైనంత త్వరగా వైద్యశాల ఆవరణలో క్యాంటీన్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను డిప్యూటీ ఛైర్మన్ యల్లంపాటి కోటేశ్వరబాబు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి పాల్గొన్నారు.