ర్యాలీలో పాల్గొన్న స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- ఆమదాలవలస
సమాజంలో కుల, మత, జాతి, వ్యత్యాసాలతో పాటు ఏ కుటుంబంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య జండర్ వివక్ష వద్దని, సమ సమాజ స్థాపనకు బాల బాలికలందరికీ చదువు ముద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం శ్రీనివాసాచార్యుల పేటలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన జండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జరిపిన జాతీయస్థాయి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి తరాల్లో ప్రతి కుటుంబం భవిష్యత్ కూడా తమ పిల్లల చదువు, ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని సిఎం జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, సేద్యం, తాగునీరు, సాగునీరుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు గురుగుబెల్లి ప్రభాకరరావు, ఎంపిడిఒ వాసుదేవరావు, మండల సర్వేయర్ బొడ్డేపల్లి గోపి, ఎపిఎం పైడి కూర్మారావు, క్లస్టర్ కో-ఆర్డినేటర్ సుభద్ర, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ లక్ష్మి, గ్రామ సంఘం ప్రతినిధులు సుశీల, లక్ష్మి, మహిళా సంఘాల నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.శ్రీకాకుళం అర్బన్: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆదేశాలను అనుసరించి డిఆర్‌డిఎ ఆధ్వర్యాన నగరంలో లింగ ఆదారిత వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సమాఖ్య ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పాతశ్రీకాకుళం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మూల కృష్ణవేణి జెండాను ఎగుర వేసి ర్యాలీ ప్రారంభించారు. సెర్చ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు ఎస్. వైకుంఠరావు, బి.నారాయణరావు, మోహనరావు, ఎపిఎం ఎన్ .ధనలక్ష్మి, బ్యాంకు లింకేజి డిపిఎం ఎన్.నాగలక్ష్మి, బాలల హక్కుల పరిరక్షణ కమిటి అధికారి మల్లేశ్వరరావు, మహిళా పోలీస్ రేణుకాదేవి పాల్గొన్నారు.నందిగాం: లింగ వివక్షత, బాల్యవివాహాల నిర్మూలనపై శుక్రవారం నందిగాంలో ర్యాలీ నిర్వహించారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎంపిపి నడుపూరు శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలనపై గ్రామాల్లో మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్య పర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎపిఎం సిహెచ్ నీలవేణి, కల్లాడ సర్పంచ్ మడపాల తిరుపతిరావు, ఐకెపి సిబ్బంది, ఎఎన్‌ఎంలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.మెళియాపుట్టి: పురుషులతో పాటు స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, లింగ వివక్ష, హింస చూపొద్దని తహశీల్దార్ పి.సరోజిని, ఎంపిడిఒ చంద్రకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వెలుగు కార్యాలయం నుంచి మూడు రోడ్లు వరకు పలు నినాదాలు చేస్తూ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఆడ, మగ ఇద్దరూ సమానమేనన్న సదృష్టిని ప్రతిఒక్కరు అలవర్చుకొని లింగవివక్షకు ముగింపు పలకాలన్నారు. కార్యక్రమంలో ఎపిఎం లలిత, ఎఎస్‌ఐ బి.అప్పన్న, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: మండలంలో వివిధ గ్రామాల్లో విఒలు జెండర్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కనిపిస్తూ ర్యాలీలు, సమావేశాలు, ప్రతిజ్ఞలు, మానవహారాలు చేపట్టారు. వెలుగు ఎపిఎం ప్రసాదరావు అధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ మహిళా సంఘాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిసిలు, విఒఎలు, సంఘసభ్యులు, స్థానిక అంగన్వాడీ వర్కర్లు, ఆశవర్కర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లావేరు: మహిళలు నేటి సమాజంలో అన్నిరంగాల్లో రాణిస్తూ ముందుండాలని ఎంపిడిఒ కుప్పులి సురేష్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జెండర్‌పై లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఎంపిడిఒ మాట్లాడుతూ లింగ వివక్షతపై గ్రామాల్లో ప్రజలను చైతన్యం కలిగించాలన్నారు. కార్యక్రమంలో వెలుగు ఎపిఎం మావూరి మాధవిలత, వెలుగు సిసిలు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, స్వయం శక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.పలాస: లింగ వివక్షత లేకుండా చూడాలని డివిజన్ పంచాయతీ విస్తరణ అధికారి ఐవి రమణ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా వెలుగు మండల అధ్యక్షులు, విఒ అధ్యక్షులు, మండలస్థాయి అధికారులు, సచివాలయం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం ఎంపిడిఒ కార్యాలయం వద్ద మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్.రమేష్ నాయుడు, పంచాయతీ విస్తరణాధికారి మెట్ట వైకుంఠరావు, వెలుగు ఎపిఎం మల్లేశ్వరరావు, కార్యదర్శులు, వెలుగు అధికారులు పాల్గొన్నారు.బూర్జ: సమాజంలో మహిళను గౌరవించి సాంప్రదాయాలను కాపాడుకోవాలని జెడ్‌పిటిసి బెజ్జిపురం రామారావు, రాష్ట్ర టిడ్కో డైరెక్టర్ ఖండాపు గోవిందరావు అన్నారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బూర్జలో మహిళలు, పురుషులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. కార్యక్రమంలో పిహెచ్‌సి వైద్యులు రమ్య, రాజశేఖర్, ఎస్‌ఐ అశోక్ బాబు, ఎఎంసి మాజీ చైర్మన్ గుమ్మడి రాంబాబు, ఎంపిడిఒ రవీంద్రబాబు, తహశీల్దార్ రమణారావు, వెలుగు ఎపిఎం రాంబాబు, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఉదరు కుమార్, వైసిపి నాయకులు రాజారావు, కొత్తకోట వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు డ్వాక్రా సంఘ మహిళలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు: సమాజాన్ని జాగృతి పర్చడంలో మహిళలు కీలక భూమిక పోషించాలని ఎంపిపి ప్రతినిధి ఉప్పరపల్లి ఉదరు కుమార్ అన్నారు. లింగ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా నాలుగు వారాలు పాటు నిర్వహించే కార్యక్రమాలను శనివారం మండల కాంప్లెక్స్‌లో ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ దువ్వాడ మధుకేశవరావు, తహశీల్దార్ బి. అప్పలస్వామి, ఇఒపిఆర్‌డి డిడి.తిరుమలరావు, ఎపిఎం కోడూరు జాంబవతి, ఎంపిటిసి ఉరిటి కామేశ్వరరావు, సర్పంచ్‌లు పిట్ట గీత, డి.భాస్కరరావు, కె.మల్లేశ్వరస్వామి, టి.సుశీల, కొల్లి భాస్కరరావు, గూడ ఈశ్వరరావు, వంక చిరంజీవి, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సరుబుజ్జిలి: దేశం ఎన్నో సాంకేతిక విప్లవాలతో అభివద్ధి చెందుతున్నప్పటికీ ప్రజలు ఇంకా లింగ వివక్షతను విడనాడడం లేదని ఎంపిడిఒ పివివి మురళీమోహన్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో లింగ వివక్షతపై అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు, ఆశ కార్యకర్తలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. లింగ వివక్షత చట్టరీత్యా నేరమన్నారు. ఈనెల 25 నుండి డిసెంబర్ 22 వరకు గ్రామాల్లో అన్ని శాఖల ఆధ్వర్యంలో లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎం కమలకుమారి, ఐకెపి సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.కవిటి: సమాజంలో లింగ వివక్షకు తావులేదని, సంఘంలో స్త్రీ పురుషులు ఇరువురు సమానమేనని ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్ అన్నారు. లింగ వివక్షత రూపుమాపాలని ప్రతిజ్ఞ చేసి మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపిలు పూడి నేతాజీ, కర్రి గోపయ్య, ఎన్ని అశోక్, ఇఒపిఆర్‌డి శివాజీ పాణిగ్రాహి, ఎపిఎం గోవిందరావు, అంగన్వాడీ సూపర్ వైజర్లు కృష్ణవేణి, పల్లవి పాల్గొన్నారు.ఆమదాలవలస :