ఆగిరిపల్లి: గ్యాస్ లీకైనపుడు ఆందోళనతో కాకుండా అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రాణ, ఆస్తినష్టం నివారించవచ్చునని మేఘా సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్(మేఘా గ్యాస్) మదర్ స్టేషన్, చొప్పరమెట్ల ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జి సిహెచ్.రవికిరణ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చొప్పరమెట్ల గ్రామంలోని మేఘా గ్యాస్ ఆధ్వర్యంలో గ్యాస్ ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవాల్సిన ప్రమాద నివారణ చర్యలు గురించి మేఘా గ్యాస్, గన్నవరం ఫైర్ స్టేషన్ సిబ్బంది కలిసి లెవల్-3 మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కె.ఊర్మిళ, హెచ్‌పిసిఎల్ డిజిఎం డా.రెబ్బా అంబేద్కర్, ఆగిరిపల్లి ఎస్‌ఐ ఎన్.చంటిబాబు, ఫైర్ ఆఫీసర్ విశ్వనాధ్, మేఘాగ్యాస్ ఎజిఎం జి.రాజ్‌కుమార్, మేనేజర్ చార్‌ప్రదీశ్, వైద్యాధికారి జె.జగన్మోహనరావు పాల్గొన్నారు.