జగనన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

ప్రజాశక్తి – కడప రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. శనివారం రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫిరెన్సు ద్వారా వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ,పరిశ్రమలు, భూ రీ సర్వే, నేషనల్‌ హైవేస్‌ లాండ్‌ ఆక్వైజేషన్‌, వ్యవసాయం, హౌసింగ్‌, యుజి ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ తదితర అంశాల్లో ఇప్పటి వరకు సాధించిన పురోగతి మొదలైన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి సమీక్ష చేశారు. కలెక్టరేట్‌లోని విసి హాలు నుంచి కలెక్టర్‌ వి.విజరు రామరాజుతోపాటు జెసి గణేష్‌ కుమార్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌ హాజరయ్యారు. విసి ముగిసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సూచనలు, ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు సంతప్తి స్థాయిలో అందించాలని ఆదేశించారు .జిల్లాలో రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, భూ రికార్డుల స్వచ్చీకరణ పనులను అన్ని జిల్లాల్లో వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివద్ధి, విస్తరణ కోసం చేపడుతున్న భూ సేకరణ, పరిహారం ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.మండలాల వారీగా వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర నిర్వహించాలని జడ్‌పి సిఇఒ, డిపిఒలకు సూచించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌ నాయక్‌, జిల్లా అగ్రికల్చర్‌ జెడి నాగేశ్వ రరావు, సిపిఒ వెంకట్రావు, హౌసింగ్‌ పీడీ క్రిష్ణయ్య, పశుసంవర్ధకశాఖాధికారి శారదమ్మ, జడ్‌పి సిఇఒ సుధాకర్‌ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️