విజయనగరం : స్థానిక తోట పాలెంలో గల సత్య డిగ్రీ-పిజి కళాశాలలో శనివారం ఫ్రెషర్స్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎఎస్‌పి (అడ్మిన్) ఆస్మా ఫర్హీన్, కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం శశి భూషణ రావు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. ఎంవి సాయి దేవ మణి కళాశాలలో అందిస్తున్న సౌకర్యాల గురించి, విద్యార్థులు ఈ మూడేళ్లలో ఏ విధంగా తమ కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవాలో వివరించారు. సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రామమూర్తి విద్యార్థులు బాగా చదివి జ్ఞానవంతులు గాను విలువలతో కూడిన విద్య నేర్చుకొని తేజోవంతులుగాను తయారు కావాలని ఆకాంక్షించారు. కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం.శశి భూషణ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని అందుకు అనుగుణంగా చదవాలని కోరారు. ఎఎస్‌పి మాట్లాడుతూ విద్యార్థులు దురలవాట్లకు లోనూ కాకుండా కెరీర్ పై దృష్టి పెట్టాలని సూచించారు. మొబైల్ ద్వారా ప్రయోజనం పొందాలి గాని దాని వలన నష్టం లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం గేమ్స్, స్పోర్ట్ లో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. కరస్పాండెంట్ డాక్టర్ శశి భూషణరావు ఇటీవల జెఎన్‌టియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్ధుల సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి.