ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని 1వ డివిజన్ నందిగుడ్డి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సామాజిక భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే దిశగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలు సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కోరారని, స్పందించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి రూ.10 లక్షలు మంజూరు చేయించి సామాజిక భవన నిర్మాణానికి చొరవ చూపారని అన్నారు. డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్ మాట్లాడుతూ తమ డివిజన్ గతం కంటే ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జులు ముచ్చు శ్రీనివాసరావు, ముద్దాడ మధు, డివిజన్ ఇంఛార్జి దాసు తదితరులు పాల్గొన్నారు.కాళికాదేవి బోనాలు ఉత్సవంలో కోలగట్ల దాసన్నపేట ప్రాంతంలో కొలువైన కాళికాదేవి బోనాల ఉత్సవంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. నిర్వహకులు శ్రీను కార్పొరేటర్ పొంతపల్లి మాలతి, ఆలయ కమిటీ ప్రతినిధులు పొంతపల్లి గోపి, బోడసింగి ఈశ్వరరావు పాల్గొన్నారు.