మాట్లాడుతున్న మేయర్ స్రవంతిప్రతి
సమస్యకూ సత్వరమే పరిష్కారం
స్రవంతి ప్రజాశక్తి నెల్లూరు సిటీ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో స్థానిక ప్రతిసమస్యను సత్వరమే పరిష్కరించేలా అధికారులతో పర్యవేక్షిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం ఆమె అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో పలు తీర్మానాలను అజెండాగా, మరికొన్ని తీర్మానాలను టేబుల్ అజెండాగా సమర్పించారు. నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైను కాలువల పూడికతీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందులు, పశువుల నియంత్రణతో పాటు స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ వికాస్ మర్మత్, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు