-పోరులో ఇంగ్లండ్-ఎపై భారత్-ఏ గెలుపు
ముంబయి: మహిళా యువ ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ స్పిన్ మ్యాజిక్‌తో ఇంగ్లండ్-ఏతో జరిగిన తొలి టి20లో భారత్‌ాఎ మహిళల జట్టు సంచలన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20ఓవర్లలో 131 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా శ్రేయాంక బౌలింగ్ మాయతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే గాక రెండు వికెట్లు కూడా తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు శ్రేయాంకకు వరించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మిన్ను మణి సారథ్యంలో బరిలోకి దిగిన భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డి. వృంద(22), డి.డి. కసత్(25), దివ్య(22)లు రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. హౌలి అర్మిటెజ్(52, 41 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్), సెరెన్(31)లు రాణించడంతో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. అర్మిటెజ్‌ను 17వ ఓవర్లో మిన్ను మణి ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ మరుసటి ఓవర్లోనే సెరెన్‌ను కాశ్వీ గౌతమ్‌ను ఔట్ చేసింది. సెరెన్ నిష్క్రమించే సమయానికి ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో 114 పరుగులు చేసింది. అదే ఓవర్లో ఇస్సీ వాంగ్ కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు మొదలయ్యాయి. కెప్టెన్ చార్లీ డీన్(10) క్రీజులో ఉన్నా.. ఆఖరి ఓవర్ వేసిన శ్రేయాంక మ్యాజిక్ చేసింది. తొలి నాలుగు బంతుల్లో 9 పరుగులిచ్చిన శ్రేయాంక.. తర్వాత వరుస బంతుల్లో రియానా మాక్‌డొనాల్డ్, చార్లీ డీన్‌ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. ఇరుజట్ల మధ్య జరుగుతు మూడు టి20ల సిరీస్‌లో భారత్‌ాఎ 1ా0 ఆధిక్యతలో నిలువగా.. రెండో టి20 శుక్రవారం జరగనుంది.