రేపు రాత్రి 7.00గంపపలకు
రాయ్ పూర్: తొలి రెండు టి20ల్లో నెగ్గిన టీమిండియా.. మూడో టి20లో భారీ స్కోర్ చేసినా చేజేతులా పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో ఆసీస్‌తో శుక్రవారం జరిగే నాల్గో టి20లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే ముగించాలని భారత్ భావిస్తోంది. బ్యాటర్స్ అద్భుత ఫామ్‌లో ఉన్నా.. బౌలర్లు ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మూడో టి20లో 222పరుగుల భారీ స్కోర్‌ను ఆసీస్ జట్టు ఛేదించకుండా భారత బౌలర్లు నిరోధించలేకపోయారు. చివరి 12 బంతుల్లో ఆసీస్ జట్టు 43పరుగులు రాబట్టి గెలిచిన తీరు వర్ణణాతీతం. మరోవైపు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూడో టి20 ముగిసాయ ఆసీస్ స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ఆడం జంపా, మ్యాక్స్‌వెల్, స్టొయినీస్, ఇంగ్లిస్, అబట్ స్వదేశానికి బయల్దేరారు. గౌహతి వేదికగా జరిగిన మూడో టి20లో ఆసీస్‌ను గెలిపించిన మ్యాక్స్‌వెల్ జట్టుకు దూరం కావడం ఆసీస్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.జట్లు(అంచనా)..
భారత్: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకు సింగ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, ఆర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్.
ఆస్ట్రేలియా: మాధ్యూ వేడ్(కెప్టెన్, వికెట్ కీపర్), హెడ్, షార్ట్, హార్డి, డెర్మాట్, టిమ్ డేవిడ్, గ్రీన్, డ్వార్షిస్/రిచర్డుసన్, ఎల్లిస్, బెహ్రెన్‌డార్ఫ్, సంఘా.