7న బిసిల పోరాట రథయాత్ర

Nov 25,2023 23:50
దశాబ్దాలు గడుస్తున్నా బిసిలకు సమన్యాయం జరగలేదని, బిసిల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను జాతీయ బిసి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరాజు తెలిపారు. డిసెంబర్‌ 7న ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న రథయాత్ర

పలాస : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి సీదిరి

ప్రజాశక్తి- పలాస

దశాబ్దాలు గడుస్తున్నా బిసిలకు సమన్యాయం జరగలేదని, బిసిల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను జాతీయ బిసి సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు పిట్ట చంద్రపతిరాజు తెలిపారు. డిసెంబర్‌ 7న ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న రథయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిసిలకు 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 పార్లమెంటు స్థానాలకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ పార్టీలు 275 పార్లమెంటు స్థానాలను బిసిలకు కేటాయించాలని ఎజెండాతో ఈ పోరాట రథయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి బడుగు బలహీన వర్గాల చెందిన వ్యక్తులు బిసిల పోరాట రథయాత్రలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అమరుల్లా బెన్‌, వజ్రపుకొత్తూరు ఎంపిపి ఉప్పరపల్లి ఉదరు కుమార్‌, గొర్రెలు, మేకలు సహకార అభివృద్ధి సమైక్య జిల్లా అధ్యక్షులు రాపాక చిన్నారావు, పాలీన ప్రసాద్‌, తిప్పనా గాంధీ పాల్గొన్నారు.కవిటి: వైసిపి ప్రభుత్వంలో బిసిలకు పెద్దపీట వేస్తునట్టు ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలిపారు. బిసి సంక్షేమం, హక్కులతో కూడిన వాల్‌పోస్టర్‌ శనివారం ఎమ్మెల్సీ రామారావు కొత్తపుట్టుగలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గంలో డిసెంబర్‌ 7వ తేదీన బిసి సంక్షేమం, హక్కుల రథయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో జరగనున్న ఈ రథయాత్ర తిరుపతిలో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్ట చంద్రపతి, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ అమిల్లా బేగ్‌, కె.వెంకటరమణ, బీన ఢిల్లీరావు, తిప్పన గాంధీ, సాలిన ప్రసాద్‌, ఈరోతు శ్రీనివాస్‌, పిట్ట హేమ సుందర్‌, కోట హరికృష్ణ, బి.అశోక్‌ పాల్గొన్నారు.

 

➡️