రైతుల సమస్యలు పరిష్కరించాలి

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పలాసలో పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి

మంత్రితో మాట్లాడుతున్న రైతుసంఘాల నాయకులు

  • సిఎంను కలిసేందుకు అవకాశం కల్పించాలి
  • మంత్రి అప్పలరాజును కోరిన రైతు సంఘాల నాయకులు

ప్రజాశక్తి – పలాస

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పలాసలో పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలని రైతుసంఘాల నాయకులు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును కోరారు. ఈమేరకు మంత్రిని సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. జీడి, కొబ్బరి, వరి సాగు చేస్తున్న రైతులు పలురకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి సిఎంకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ముగ్గురు ప్రతినిధులను ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రైతు సంఘాల నాయకులు తెప్పల అజరు కుమార్‌, కాంతారావు, కుత్తమ్‌ వినోద్‌ కుమార్‌, గురయ్య, లక్ష్మీనారాయణ, అంబటి ఆనందరావు తదితరులున్నారు.

 

➡️