మీ ఉత్సాహం ఆదర్శం కావాలి

ల్లాస్థాయిలో నిర్వహించే వికలాంగుల ఆటల పోటీల్లో పతకాలు సాధించడమే కాకుండా రాష్ట్రస్థాయిలోనూ సాధించాలని, మీ ఉత్సాహం పలువురికి ఆదర్శం కావాలని

జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

 * వికలాంగుల క్రీడా పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాస్థాయిలో నిర్వహించే వికలాంగుల ఆటల పోటీల్లో పతకాలు సాధించడమే కాకుండా రాష్ట్రస్థాయిలోనూ సాధించాలని, మీ ఉత్సాహం పలువురికి ఆదర్శం కావాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యాన నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి ఆటల పోటీలను ఆదివారం నిర్వహించారు. బాలికల పరుగు పందెంను పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్న పలు క్రీడల్లో పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ కార్యకమాలను అమలు చేయడమే కాకుండా జిల్లాస్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల్లో సుమారు 400 మంది వికలాంగులు పాల్గొనడం ఆనందదాయకమన్నారు. ఈ పోటీల్లో విజేతలకు డిసెంబరు 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం నాడు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో మరిన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు కె.కవిత, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బాలమాన్‌సింగ్‌, జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️