బాల్య వివాహాలు నేరం

Nov 22,2023 19:43
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటిపై తప్పనిసరిగా నిఘా వేయాలని ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, తహశీల్దార్‌ పి.శేఖర్‌ తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి బాల్య వివాహాల కమిటీ సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ

ప్రజాశక్తి- కవిటి

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వీటిపై తప్పనిసరిగా నిఘా వేయాలని ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, తహశీల్దార్‌ పి.శేఖర్‌ తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి బాల్య వివాహాల కమిటీ సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలతో వచ్చే అనర్థాలు, భవిష్యత్‌లో ఎదుర్కోబోయే సమస్యలు గ్రామస్థాయిలో తెలియజేయాలని మహిళా పోలీసులకు సూచించారు. పంచాయతీ పరిధిలో బాల్యవివాహాల కమిటీలు ఏర్పాటు చేసి బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంఇఒ ధనుంజయ మజ్జి, సిడిపిఒ పి.నాగారాణి, సూపర్‌ వైజర్లు జి.కృష్ణవేణి, పి.పల్లవి, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో 13,14, 16,17 వార్డుల్లో బాల్య వివాహాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. 12, 13, 14 వార్డుల్లో చైర్‌పర్సన్‌ పి.రాజ్యలక్ష్మి ఆధ్వర్యాన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. 16, 17 వార్డుల్లో నిర్వహించిన సదస్సులో వైస్‌ చైర్‌పర్సన్‌ భారతీ దివ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ గీతారాణి, ఎఎన్‌ఎం ఎర్రమ్మ, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️