పేదలు పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి : కెవిపిఎస్‌

తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన కెవిపిఎస్‌ నాయకులు

                  గోరంట్ల రూరల్‌ : మండల పరిధిలోని పాలసముద్రం గ్రామంలో పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, సహాయ కార్యదర్శి వెంకటేష్‌ మాట్లాడుతూ అనుభవంలో ఉన్న వడ్డెర కుటుంబాలకు పొజిషన్‌ సర్టిఫికెట్స్‌, దళితులకు ఇళ్ల స్థలాలు చూపాలని 4 నెలల క్రితం జిల్లా కలెక్టర్‌, గ్రామ సచివాలయం, తహశీల్దార్‌ కార్యాలయాల్లో వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదన్నారు. ఇకనైనా నిర్ధిష్ట గడువు లోపు దరఖాస్తుదారులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చేంత వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. దీంతో తహశీల్దార్‌ రంగనాయకులు నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పట్టాలు ఇచ్చి దశాబ్దాలు గడిచినా ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. దీంతో పేదలు న్యాయం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేయగా స్పందించిన తహశీల్దార్‌ వారంలో సమస్యను పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. ధర్కాలో సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేశులు, దరఖాస్తుదారులు రామ లక్ష్మమ్మ, రహంతుల్లా, శ్రీరాములు, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

➡️