ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల కేంద్రం ఎడవలి గ్రామపంచాయతీలో ఉన్న పొదుపు సంఘాల్లో అవినీతి జరిగినట్లు ఏపీఎం మధుబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు గతంలో బ్యాంకు లీకేజీ, ఉన్నతి, శ్రీనిధి, ఎస్సీ ఎస్ టి లోన్లు ఇచ్చినట్లు తెలిపారు. లబ్ధిదారులు తీసుకున్న రుణాలు మొండి బకాయిలుగా ఉన్నాయని, త్వరగా చెల్లించాలని పొదుపు సంఘాలకు సూచించారు. రెగ్యులర్ గా చెల్లించిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి జీవనోపాదులు మరియు అధిక మొత్తంలో రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. ప్రస్తుత బుక్ కీపర్ ని తొలగించి ఆ పోస్టులో పొదుపు సంఘాల లీడర్ ద్వారా కొత్త బుక్ కీపర్ ను నియమించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల సిబ్బంది సర్పంచ్ నంది కల్పన పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.