ప్రజాశక్తి-విజయనగరం కోట : పర్యావరణానికి హాని కలగని వాటిని ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కోరారు. స్థానిక ఉడా కాలనీ ఫేస్ -3 ఆర్‌ఆర్ ఎబిలిడి కాఫీ షాప్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇక్కడ కాఫీ తో పాటు వారిచ్చే టీ కప్పు కూడా తినేయడానికి ఎంతో బాగుంటుందని, దీనివల్ల ఎటువంటి పర్యావరణం హాని కలగకుండా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో షాప్ యాజమాని దాట్ల రవిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ త్రినాథ్, గంట్యాడ మండలం టిడిపి అధ్యక్షులు కొండపల్లి భాస్కరరావు, ఎస్‌ఎన్‌ఎం రాజు, తదితరులు పాల్గొన్నారు.