వాషింగ్టన్ : దిగ్గజ టెక్, ఇాకామర్స్ కంపెనీ అమెజాన్ కూడా కృత్రిమ మేధా (ఎఐ) ‘చాట్‌బోట్-క్యూ’ను ప్రారంభించింది. చాట్‌జిపిటికి పోటీగా దీన్ని ఆవిష్కరించింది. ఈ విషయాన్ని లాస్‌వేగాస్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యూఎస్) క్లౌడ్ వార్షిక సదస్సులో ఎడబ్ల్యుఎస్ సిఇఒ ఆడం సెలీప్ స్కై వెల్లడించారు. దీన్ని త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నామన్నారు. కంటెంట్ తయారీ, రోజువారీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్రమబద్ధీకరణ, బ్లాగ్ పోస్ట్‌ల రచన వంటి పనులను క్యూ తేలిగ్గా చేస్తుందని ఆడం పేర్కొన్నారు.