స్నేహం విలువ

Nov 19,2023 08:01 #kavithalu, #Sneha

స్నేహం చేయడం ఒక గొప్ప అనుభూతి. స్నేహం అనే అనుభూతిని పాలుపంచుకొనే వారిని స్నేహితులు అని అంటారు.
స్నేహితుడు అంటే మనలానే ఆలోచించి, అర్థం చేసుకునే వ్యక్తి.
స్నేహానికి లింగ విభేదాలు ఉండవు.
నిజమైన స్నేహం స్వచ్ఛమైనది.
అది ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలకు తావు ఇవ్వదు.
నిజమైన స్నేహితుడు తోడుగా ఉంటాడు. స్నేహితుడు అంటే మన మంచి కోరే వ్యక్తి. మంచి సలహాలు ఇస్తాడు. స్నేహితుల మధ్య లింగ, కుల, జాతి, పేద, ధనిక వంటి తారతమ్యాలు ఉండవు.
మంచి స్నేహితుల మధ్య నిస్వార్థం, ప్రేమ, ఆత్మీయత ఉంటుంది. మానవులమైన మనకి మంచి స్నేహితులు అవసరం. స్నేహితులతో మన సుఖ దుఃఖాలను పాలుపంచుకోవచ్చు. మంచి స్నేహితుల మధ్య మన జీవితం ఆనందంగా, సురక్షితంగా ఉంటుంది. స్నేహానికి ఎవ్వరూ విలువ కట్టలేరు. స్నేహం గురించి చెప్పడం కన్నా దాన్ని అనుభవిస్తేనే తెలుస్తోంది.
అటువంటి స్నేహితులను ఎప్పటికీ మరువకండి.

– జి. గగనశ్రీ,
6వ తరగతి

➡️