బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల నిరసన

బిఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్‌ ఫోరం ఆఫ్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ అసోసియేషన్స్‌ పిలుపులో భాగంగా నగరంలోని సంచార్‌ భవన్‌ వద్ద ఆ సంస్థ ఉద్యోగులు

నిరసన తెలుపుతున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

బిఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జాయింట్‌ ఫోరం ఆఫ్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ అసోసియేషన్స్‌ పిలుపులో భాగంగా నగరంలోని సంచార్‌ భవన్‌ వద్ద ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ ఫోరం నాయకులు ఎం.గోవర్థనరావు, పోలాకి వెంకటరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేటు మొబైల్‌ సంస్థలకు ధీటుగా బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జి, 5జి సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిఎస్‌ఎన్‌ఎల్‌పై వివక్షను విడనాడి సంస్థను కాపాడాలని కోరారు. ఉద్యోగులకు 2017 జనవరి నుంచి రావాల్సిన వేతన సవరణ 15 శాతం ఫిట్‌మెంట్‌ను సత్వరమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో సమానంగా ఐదేళ్లకోసారి ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్ష్మి, అరుణ, అభిమన్యు, గోపాలరావు, పైల మల్లేశ్వరరావు, ఎం.వెంకటరావు, గోవిందరావు, పి.సూర్యం, దమయంతి, సుధ తదితరులు పాల్గొన్నారు.

 

➡️